శ్రీ కృష్ణ లీలలు
ఇదొక అద్భుతమైన అవకాశం.
ఎవరినోట విన్నా ఒకటే మాట.. ఒత్తిడి. ఆందోళన. మనశ్శాంతి కరువై ఆనందం ఆవిరైపోయిన వారికోసం.. వేసవి తాపానికి చిరుజల్లు లా కావ్యపాఠం.
సాహిత్యం ద్వారా మనసులోని ఒత్తిళ్ళను తగ్గించి ఆరోగ్యాన్ని పంచే మార్గం.
డా. అద్దంకి శ్రీనివాస్ గారి బోధనలో ఎంతో మధురమైన భాగవతాన్ని విందాం రండి.
పిల్లలూ పెద్దలూ ఉద్యోగస్థులూ అందరికీ అనువైన సమయం. భారతకాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు. ఒక గంటసేపు భాగవతం అనే అమృతసాగరంలో ఓలలాడి శ్రీకృష్ణలీలల్ని ఆస్వాదించండి.
వ్యాసభాగవతాన్ని పోతనభాగవతాన్ని మేళవిస్తూ సాగే ఈ కమనీయమైన కావ్యపాఠంలో మీరు చేరాలనుకుంటున్నారా..
వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి.